యువ ప్లేయర్లు శుభ్ మన్ గిల్(Gill), రిషభ్ పంత్(Pant) నిలకడగా ఆడటంతో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. బంగ్లాకు ఫాలో ఆన్ ఆడే ఛాన్స్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమ్ఇండియా… 67/3తో మూడోరోజు మొదలుపెట్టింది. గిల్ 79 బంతుల్లో, పంత్ 88 బాల్స్ లో హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకున్నారు.
తొలి ఇన్నింగ్స్ రోహిత్ సేన 376 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 149కే ఆలౌటై 227 రన్స్ వెనుకబడింది. రెండో ఇన్నింగ్స్ లో గిల్-పంత్ జోడీ సెంచరీ పార్ట్నర్ షిప్ తో భారత్ కు 400 పరుగుల ఆధిక్యం దొరికింది. గిల్(86 బ్యాటింగ్), పంత్(82 బ్యాటింగ్)తో లంచ్ విరామానికి టీమ్ఇండియా 204/3తో నిలిచి ఓవరాల్ గా 432 పరుగుల లీడ్ లో ఉంది.