సూర్యకుమార్ యాదవ్(6) మినహా మిగిలిన బ్యాటర్లంతా నిలకడగా ఆడటంతో భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. టాప్(Top), మిడిలార్డర్(Middle Order) ప్లేయర్లంతా సిక్స్ లు బాదడంతో ధారాళంగా పరుగులు వచ్చాయి. కోహ్లి, పాండ్య, దూబె మూడేసి సిక్స్ లతో విరుచుకుపడ్డారు.
పాండ్య ఫిఫ్టీ…
రోహిత్(23; 11 బంతుల్లో 3×4, 1×6), విరాట్(37; 28 బంతుల్లో 1×4, 3×6), పంత్(36; 24 బంతుల్లో 4×4, 2×6), దూబె(34; 24 బంతుల్లో 3×6) రాణించారు. హార్దిక్ పాండ్య(50 నాటౌట్; 27 బంతుల్లో 4×4, 3×6) చివరి వరకు క్రీజులోనే నిలదొక్కుకుని స్కోరును ముందుండి నడిపించాడు. దీంతో టీమ్ఇండియా 5 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.