పేస్ బౌలర్లు విజృంభించడంతో సిడ్నీ టెస్టులో భారతజట్టుకు స్వల్ప ఆధిక్యం(Lead) లభించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమ్ఇండియా 185 పరుగులకు ఆలౌటైతే.. ఆస్ట్రేలియా 181 స్కోరుకే కుప్పకూలింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో బుమ్రా సేనకు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. కొత్త కుర్రాడ్ బ్యూ వెబ్ స్టర్(57) టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోన్స్టాస్(23), ఖవాజా(2), లబుషేన్(2), స్మిత్(33), ట్రావిస్ హెడ్(4), క్యారీ(21), కమిన్స్(10) చొప్పున చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మూడేసి చొప్పున.. బుమ్రా, నితీశ్ కుమార్ రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు.