జింబాబ్వే(Zimbabwe)తో జరుగుతున్న మూడో టీ20లోనూ భారత జట్టు విజయం సాధించింది. తొలి మ్యాచ్ ఓడి రెండో టీ20 నెగ్గిన గిల్ సేన.. ఇందులోనూ పూర్తి ఆధిపత్యం చూపించింది. టాస్ నెగ్గిన భారత్ తొలుత 4 వికెట్లకు 182 చేసింది. ఆ తర్వాత జింబాబ్వే 39 స్కోరుకే 5 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. చివరకు 159/6తో నిలిచి 23 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.
భారత్ భళా…
ఈ మ్యచ్ తోనే జట్టులో చేరిన జైస్వాల్.. గిల్ జోడీగా ఓపెనింగ్ చేశాడు. దీంతో అభిషేక్ శర్మ వన్ డౌన్లో రావాల్సి వచ్చింది. యశస్వి(36), గిల్(66), అభిషేక్(10), రుతురాజ్(49), సంజూ(12 నాటౌట్) స్కోర్లు చేశారు.
జింబాబ్వే ఢీలా…
మధేవ్రె(1), మరుమణి(13), బెనెట్(4), మయర్స్(57), సికిందర్(15), క్యాంప్ బెల్(1), మదాండే(37) పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ 3, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు తీసుకోవడంతో జింబాబ్వే కథ ముగిసింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1తో నిలిచింది.