భారత్ ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కంగారూల్ని దెబ్బకు దెబ్బ(Revenge) తీశారు టీమ్ఇండియా ప్లేయర్లు. సిడ్నీ(Sydney)లో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియాను 96కే ఐదు వికెట్లు నేలకూల్చారు. భారత పేసర్లు పోటాపోటీగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కోలుకోకుండా చేశారు. ఆట తొలిరోజు ఖవాజా(2) వికెట్ తీసుకోగా.. రెండో రోజు కోన్స్టాస్(23), లబుషేన్(2), స్మిత్(33), ట్రావిస్ హెడ్(4)ను ఔట్ చేశారు. ఖవాజా, లబుషేన్ ను బుమ్రా.. కోన్స్టాస్, హెడ్ ను సిరాజ్.. స్మిత్ ను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ పంపారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.