
భారత కుర్రాళ్లు దాయాదితో పోరుకు సిద్ధమయ్యారు. ఆసియా కప్ అండర్-19 వన్డే టోర్నీలో నేడు పాకిస్థాన్ తో ఆడుతున్నారు. ఉదయం పదిన్నరకు దుబాయిలో మ్యాచ్ మొదలవుతుంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయి ఆడుతున్నాడు. రెండ్రోజుల క్రితం UAEపై 95 బంతుల్లోనే 171 పరుగులు చేయగా, 14 సిక్సర్లున్నాయి. ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా సైతం బాగా ఆడుతుండటంతో భారత యువ జట్టు మంచి స్కోరు నమోదు చేస్తోంది.