ఇంగ్లండ్ తో ఐదో టెస్టులో భారత్ సంచలన విజయం సాధించింది. 339/6తో గెలుపునకు మరో 35 పరుగులు చేయాల్సిన దశలో చివరి రోజు బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ను టీమిండియా బౌలర్లు దెబ్బతీశారు. తొలి ఇన్నింగ్స్ లో చెరో నాలుగు వికెట్ల చొప్పున తీసుకున్న ప్రసిద్ధ్, సిరాజ్.. రెండో ఇన్నింగ్స్ లోనూ అదే రీతిలో రెచ్చిపోయారు. 367 కు ఇంగ్లీష్ టీం ఆలౌట్ కావడంతో 6 పరుగుల తేడాతో భారత్ అనూహ్య విజయం దక్కించుకుంది. క్యాచ్ జారవిడిచి నిన్న అభాసుపాలైన సిరాజ్.. 5 వికెట్లతో ఒక్క రోజులోనే హీరోగా మారాడు. ఈ గెలుపుతో 5 మ్యాచ్ ల సిరీస్ 2-2తో సమమైంది.