రెండో టెస్టులో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. సెకండ్ ఇన్నింగ్స్ లో గిల్(161; 162 బంతుల్లో 13×4, 8×6), జడేజా(69), పంత్(65), రాహుల్(55) నిలబడటంతో 427/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం(180 పరుగులు) కలిపి ఇంగ్లండ్ కు 607 టార్గెట్ ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో టీమ్ఇండియా 587, ఇంగ్లండ్ 407 స్కోర్లు చేశాయి. సిక్స్ లు, ఫోర్లతో గిల్ హవా కొనసాగింది. అతడు ఔటైన కొద్దిసేపటికే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశారు.