
ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సెమీస్ లో మట్టికరిపించిన భారత మహిళల జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. వుమెన్ టీమ్ కు ఇది మూడో ఫైనల్. 2005లో తొలిసారి ఫైనల్ చేరి ఆసీస్ చేతిలో ఓడింది. ఇక 2017లోనూ 9 పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. కానీ ఈసారి సెమీస్ ఆట చూశాక భారత్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈసారి కప్పు మనదే అన్న ధైర్యం కనపడుతోంది. హర్మన్, జెమీమా, స్మృతి, షెఫాలి, దీప్తి, రిచా ఘోష్ తో బ్యాటింగ్ బలంగా ఉన్నా ఎంతమంది ఆడతారో చూడాల్సి ఉంది. మధ్యాహ్నం 3 నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది.