
భారత్ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు నేడే ప్రారంభమవుతుంది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఉదయం 9:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండు టెస్టుల సిరీస్ లో ఇరుజట్లకు మంచి స్పిన్ బలం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ లోనూ భారత్-సౌతాఫ్రికా సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్-Aతో ప్రాక్టీస్ మ్యాచ్ లాడిన సఫారీలు.. ఇక అసలు పోరులో దిగుతున్నారు. జులైలో ఇంగ్లండ్ తో సిరీస్ గాయమై జట్టుకు దూరమై వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగొచ్చాడు. సౌతాఫ్రికా-Aతో అనధికారిక టెస్టులో సెంచరీ చేసి ఫామ్ చూపించాడు.