
ఒకటి గెలిచి, మరొకటి ఓడిన భారత్ నేడు దక్షిణాఫ్రికాతో మూడో టీ20 ఆడుతోంది. రాత్రి 7 గంటలకు ధర్మశాలలో మ్యాచ్ మొదలవుతుంది. దక్షిణాఫ్రికా జోరు మీదుంటే భారత్ బౌలింగ్ తేలిపోతోంది. ఇక కెప్టెన్ సూర్య, ఓపెనర్ గిల్ ఫామ్ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ లో గిల్ ఉంటాడా అన్నది డౌట్ గా మారింది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపైనా కోచ్ గంభీర్ పై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులో ఒకట్రెండు మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది.