తక్కువ టార్గెటే అయినా భారతజట్టు(Team India) చెమటోడ్చక తప్పలేదు. 132 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమ్ ను చివరి వరుస బ్యాటర్లు ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కకపోగా మ్యాచ్ టైగా ముగిసింది. కొలంబోలో జరిగిన తొలి వన్డే(ODI)లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక 8 వికెట్లకు 230 స్కోరు చేసింది. అనంతరం టీమ్ఇండియా పడుతూ లేస్తూ ఇన్నింగ్స్ సాగించి చివరకు అదే స్కోరు వద్ద ఇన్నింగ్స్ ముగించింది.
పథుమ్ నిశాంక(56), ఆవిష్క ఫెర్నాండో(1), కుశాల్ మెండిస్(14), సమరవిక్రమ(8), అసలంక(14), వెల్లాలగె(67), హసరంగ(24) పరుగులు చేశారు. అర్షదీప్, అక్షర్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ ఘనంగానే మొదలైంది. రోహిత్(58), గిల్(16) తొలి వికెట్ కు 75 రన్స్ వచ్చాయి. ఈ ఇద్దరి తర్వాత కోహ్లి(24), వాషింగ్టన్ సుందర్(5), శ్రేయస్(23), రాహుల్(31) వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో భారమంతా అక్షర్(33), దూబెపై పడింది. చివర్లో దూబె(25) ఔటవడం టీమ్ఇండియాపై ప్రభావం చూపింది.