బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు(First Test)లో భారత్ మంచి స్కోరు చేసింది. అశ్విన్(113), జడేజా(86) జోడీ ఏడో వికెట్ కు 199 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో తొలి ఇన్నింగ్స్ లో 376 స్కోరుకు ఆలౌటైంది. 339/6తో రెండో రోజు ఆట కొనసాగించిన టీమ్ఇండియా.. మరో 4 పరుగులు జత కాగానే జడేజా అవుటయ్యాడు. కానీ ఆకాశ్ దీప్(17) కాసేపు నిలబడటంతో స్కోరు 350 దాటింది.
హసన్ మహమూద్ 5 వికెట్లు తీసుకోగా.. టస్కిన్ అహ్మద్ 3, నహిద్ 1, మిరాజ్ 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లా 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. షద్మాన్ ఇస్లాం(2)ను బుమ్రా బౌల్డ్ చేశాడు.