ప్రత్యర్థి ఎదుట భారీ టార్గెట్ ను ఉంచిన భారత్.. బంగ్లాదేశ్ ను కోలుకోలేని దెబ్బతీసింది. 514 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ టీమ్.. మూడోరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 158 పరుగులు చేయగా, మరో 357 రన్స్ చేయాల్సి ఉంది. అంతకుముందు 81/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా 287/4 వద్ద డిక్లేర్ చేసింది.
గిల్(119 నాటౌట్), పంత్(109) సెంచరీలతో రెచ్చిపోవడంతో రోహిత్ సేన భారీ ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లా.. జాకీర్(33), షాద్మాన్(35), హక్(13), రహీం(13) వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శాంటో(51 బ్యాటింగ్), షకీబ్(5 బ్యాటింగ్) పోరాడుతున్నారు. వెలుతురు లేని కారణంగా ఆటను 10 ఓవర్ల ముందుగానే నిలిపివేశారు. అశ్విన్ 3, బుమ్రా ఒక వికెట్ తీసుకున్నారు.