తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కొద్దిలో సెంచరీ చేజార్చుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashaswi Jaiswal).. రెండో టెస్టులోనూ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. అయితే ఆడినంత సేపు గిల్ దడదడలాడిస్తే కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఇంగ్లండతో విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు(Second Test)లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు రోహిత్. లంచ్ విరామ సమయానికి టీమ్ఇండియా 2 వికెట్ల నష్టానికి 103 స్కోరు చేసింది.
రోహిత్ కంటిన్యూ ఫెయిల్యూర్స్…
ఫస్ట్ వికెట్ 40 పరుగులు జతయ్యాక రోహిత్(14) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. షోయబ్ బషీర్ బౌలింగ్ లో పోప్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఫస్ట్ టెస్ట్ లోనూ రోహిత్ విఫలమైన సంగతి తెలిసిందే. వరుసగా ఫెయిల్ అవుతున్న శుభ్ మన్ ఈ మ్యాచ్ లో ఫామ్ లోకొచ్చినట్లే కనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లను అలవోకగా ఆడేస్తూ 46 బాల్స్ లోనే 5 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. కానీ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ కు దొరికిపోయి స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
కొత్త ముఖానికి చోటు…
ఈ మ్యాచ్ లో టీమిండియా.. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేస్ బౌలర్లతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా స్థానా(Places)ల్లో రజత్ పటీదార్, కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకున్నారు. 30 ఏళ్ల 247 రోజుల వయసు గల పటీదార్.. ఈ మ్యాచ్ తో టెస్టు క్రికెట్ లో అడుగుపెట్టాడు. సర్ఫరాజ్ ఖాన్ కాకుండా అతడి కన్నా సీనియర్ అయిన పటీదార్ నే టీమ్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసింది.
Published 02 Feb 2024