భారత బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ విదేశీ గడ్డపై దడదడలాడిస్తూ న్యూజిలాండ్ భారీ ఆధిక్యాన్ని(Lead) సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులు చేసిన కివీస్.. టీమ్ఇండియాను 156కే ఆలౌట్ చేసి 103 పరుగుల ఆధిక్యం పొందింది. వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు తీస్తే మిచెల్ శాంట్నర్ సైతం 7 వికెట్లతో దీటుగా బదులిచ్చాడు. జడేజా(38) హయ్యెస్ట్ స్కోరు కాగా జైస్వాల్(30), రోహిత్(0), గిల్(30), కోహ్లి(1), పంత్ (18), సర్ఫరాజ్(11) రన్స్ చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ కేవలం ఒక వికెట్ కోల్పోయి 50 మార్కును అందుకుంది.