న్యూజిలాండ్ పై భారత్ కు స్వల్ప ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 235కు కుప్పకూలితే ప్రతిగా టీమ్ఇండియా 263 రన్స్ కు ఆలౌటైంది. దీంతో 28 పరుగుల స్వల్ప ఆధిక్యం(Lead) లభించింది. రెండోరోజు గిల్-పంత్ జోడీ 94 రన్స్ జోడించడంతో ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. గిల్(90), పంత్(60), వాషింగ్టన్ సుందర్(38 నాటౌట్), జైస్వాల్(30) రన్స్ చేయగా.. రోహిత్(18), కోహ్లి(4), సర్ఫరాజ్(0) మరోసారి నిరాశపరిచారు. 200 అయినా దాటుతుందా అన్న అనుమానాల నడుమ వాషింగ్టన్ చివరిదాకా నిలబడి పోరాటం చేశాడు. అజాజ్ పటేల్ 5 వికెట్లు తీసుకున్నాడు.