ఈ శ్రీలంక టూర్ కు ముందు ఆ టీమ్ తో ఆడిన 10 సిరీస్ ల్లో భారత జట్టుదే విజయం. మ్యాచులు ఎక్కడ జరిగినా విజయం మాత్రం టీమ్ఇండియాదే. కానీ ఈసారి అది తలకిందులై ప్రత్యర్థి పూర్తి పట్టు బిగించింది. ద్వైపాక్షిక(Bilateral) సిరీస్ ల్లో గత 27 ఏళ్లుగా భారత్ పై గెలవని లంకేయులు.. ఇప్పుడు వరుస వన్డేల్లో విజయం ద్వారా 2-0తో కప్పునందుకుని ఆ రికార్డును సవరించారు.
తొలుత 7 వికెట్లకు 248 పరుగులు చేసింది శ్రీలంక. ఆవిష్క(96) కుశాల్(59), నిశాంక(45), కమిందు(23 నాటౌట్) సత్తా చూపితే.. పరాగ్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత గిల్(6), రోహిత్(35), పంత్(6), కోహ్లి(20), అక్షర్(2), శ్రేయస్(6), పరాగ్(15), దూబె(9) సుందర్(30) సైతం వికెట్లు సమర్పించుకోవడంతో 101కే 8 వికెట్లు కోల్పోయింది టీమ్ఇండియా.
వెల్లాలగె 5, వాండర్సే 2, తీక్షణ 2 వికెట్లు తీయడంతో 26.1 ఓవర్లలోనే 138 పరుగులకు ఆలౌటైన భారత్ 110 రన్స్ తేడాతో ఓటమి చెందింది. తొలి వన్డే టై కాగా.. చివరి రెండు మ్యాచుల్లో గెలిచిన లంక 2-0తో కప్పును చేజిక్కించుకుని చాలా ఏళ్ల తర్వాత భారత్ పై ఆధిపత్యం చూపించింది.