భారీ లక్ష్యంతో(Huge Target) బరిలోకి దిగిన ఇంగ్లండ్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి అత్యంత తక్కువ స్కోరుకే కుప్పకూలి ప్రత్యర్థికి భారీ విజయాన్ని(Big Win) కట్టబెట్టింది. టీమ్ఇండియా విధించిన 557 పరుగుల టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన స్టోక్స్ సేన… 122 రన్స్ కే కుప్పకూలి 434 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ సిరీస్ లో 28 పరుగుల తేడాతో తొలి టెస్టు కోల్పోయిన రోహిత్ సేన.. వరుసగా రెండు టెస్టుల్లో గెలుపొంది 5 టెస్టుల సిరీస్ లో 2-1తో నిలిచింది.
జడేజా మ్యాజిక్…
రవిచంద్రన్ అశ్విన్ లేడనుకున్న పరిస్థితుల్లో స్పిన్నర్ గా బాధ్యతలు భుజాన వేసుకున్న రవీంద్ర జడేజా… నాలుగో రోజు మ్యాజిక్ చేశాడు. తల్లి అనారోగ్యం కారణంగా నిన్న మ్యాచ్ నుంచి తప్పుకున్న అశ్విన్ అనూహ్యంగా ఈ రోజు టీమ్ తో కలిశాడు. గ్రౌండ్ లోకి దిగి బౌలింగ్ వేశాడు. కానీ అశ్విన్ వచ్చేలోపేు ఇంగ్లండ్ నడ్డివిరిచాడు జడ్డూ. క్రాలీ(1), డకెట్(4), ఒలీ పోప్(3), రూట్(7), బెయిర్ స్టో(4), స్టోక్స్(15), ఫోక్స్(16) ఇలా టాప్, మిడిలార్డర్ అంతా చేతులెత్తేసింది. 5 వికెట్లు తీసుకుని మ్యాచ్ చివరి రోజు(Last Day) వరకు సాగకుండా చూశాడు. కుల్దీప్ 2, బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు. రన్స్ పరంగా భారత్ కు ఇదే అత్యంత పెద్ద విజయంగా నిలిచింది.
Related Stories
November 2, 2024