నేపాలీ మహిళలపై షెఫాలి దూకుడు ప్రదర్శించడంతో మహిళల ఆసియాకప్(Asia Cup)లో భారత జట్టు సెమీస్ చేరింది. పాకిస్థాన్, మలేషియాను ఓడించిన భారత్.. వరుసగా మూడో మ్యాచ్ లోనూ సత్తా చూపింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హర్మన్ ప్రీత్ సేన 178/3తో నిలిస్తే… ఛేధనలో నేపాల్ 96/9 వద్దే ఆగిపోయి 82 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఓపెనర్లు షెఫాలి వర్మ(81; 48 బంతుల్లో 12×4, 1×6), హేమలత(47), సాజీవన్ సజన(10), జెమీమా(28 నాటౌట్) ఆటతో మన మహిళలు మంచి టార్గెట్ ఇచ్చారు.
కానీ నేపాలీ మహిళల్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. సీతారాణా మగర్(18), బిందూ రావల్(17 నాటౌట్)లదే హయ్యెస్ట్ స్కోరు. దీప్తి శర్మ 3.. అరుంధతి రెడ్డి, రాధయాదవ్ రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు.