కంగారూలను కంగారెత్తించిన టీమ్ఇండియా విదేశీ గడ్డపై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఫాస్ట్ బౌలింగ్ పిచ్ పై వికెట్లు టపటపా రాలుతుంటే ఎదురొడ్డి నిలిచిన భారత బ్యాటర్లు.. ప్రత్యర్థికి భారీ టార్గెట్ ఇచ్చారు. కానీ దాన్ని ఏ దశలోనూ చేరుకునే అవకాశమివ్వకుండా వికెట్లు తీయడంతో వారి కథ ముగిసింది. ట్రావిస్ హెడ్(89) ఒంటరి పోరాటం చేస్తే, మార్ష్(47) సహకరించాడు. ఆ ఇద్దరూ ఔటవడంతో కంగారూల కథ క్లోజ్ అయింది. చివర్లో అలెక్సీ క్యారీ నిలబడ్డా లాభం లేకుండా పోయింది. 238 రన్స్ కు ఆలౌట్ కావడంతో 295 పరుగుల తేడాతో బుమ్రా సేన జయభేరి మోగించింది.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేయగా, ఆసీస్ 104కే ఆలౌట్ అయింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమ్ఇండియా 487/6కు డిక్లేర్డ్ చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 534 పరుగుల లక్ష్యాన్ని(Target) విసిరింది. న్యూజిలాండ్ తో సొంతగడ్డపై పరాజయం మూటగట్టుకున్న భారత్.. విదేశీ గడ్డపై విజయాన్ని నమోదు చేసింది. బుమ్రా, సిరాజ్ మూడేసి వికెట్ల చొప్పున, సుందర్ 2, రాణా, నితీశ్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో బుమ్రా మొత్తం 8 వికెట్లు దక్కించుకున్నాడు.