
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత్(India) గెలుపొందింది. తొలుత ఆసీస్ 186/6 చేస్తే, టీమ్ఇండియా సైత ఎదురుదాడికి దిగింది. అభిషేక్(25), గిల్(15), సూర్య(24), తిలక్(29), అక్షర్(17) రన్స్ చేయగా.. సుందర్(49 నాటౌట్; 23 బంతుల్లో 3×4, 4×6 ) విరుచుకుపడ్డాడు. భారత్ మొదట్నుంచీ 10 రన్ రేట్ తో ఆడింది. 18.3 ఓవర్లలో 188/5 చేసి 5 వికెట్లతో గెలుపొందింది. ఎలిస్ 3 వికెట్లు తీసుకుంటే, అబాట్ 3.3 ఓవర్లలో 56 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, రెండోది ఆసీస్, మూడోది భారత్ గెలిచాయి.