ICC టోర్నీల్లో పాకిస్థాన్ పై భారత్ విజయయాత్ర కొనసాగుతూనే ఉంది. తిరుగులేని రీతిలో మరోసారి దాయాది దేశాన్ని మట్టికరిపించింది. తొలుత పాకిస్థాన్ 241కి ఆలౌట్ అయితే, 242 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా.. ఎలాంటి తడబాటు లేకుండానే అందుకుంది. విరాట్ కోహ్లి సెంచరీ(100 నాటౌట్; 111 బంతుల్లో 7×4)తో మరోసారి ప్రతాపం చూపిస్తే, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ దాటాడు. రోహిత్(20), గిల్(46), అయ్యర్(56), పాండ్య(8), అక్షర్(3 నాటౌట్) పరుగులు చేశారు. కోహ్లి-అయ్యర్ జోడీ సెంచరీ పార్ట్నర్ షిప్ అందించడంతో 42.3 ఓవర్లలోనే భారత్… 244/4తో నిలిచి 6 వికెట్ల తేడాతో పాక్ కు పరాభవాన్ని చూపించింది.
పాకిస్థాన్ ఇక ఇంటికేనా…!
భారత్ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిస్తే, పాకిస్థాన్ రెండింటికి రెండు చేజార్చుకుంది. గ్రూప్-Aలో భారత్ 4, న్యూజిలాండ్ 2 పాయింట్లతో ఉన్నాయి. రేపు(ఫిబ్రవరి 24) బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ గెలిస్తే పాక్ ఇంటి బాట పడుతుంది. అదే జరిగితే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న జట్టే లీగ్ దశను దాటని దుస్థితిలో నిలుస్తుంది.