బౌలింగ్ లో బుమ్రా… కీపింగ్ లో పంత్ సత్తా చాటిన సమయాన… తక్కువ స్కోరును కాపాడుకునేందుకు కలిసికట్టుగా సాగించిన సమరం భారత జట్టుకు(Team India) అనూహ్య విజయాన్ని కట్టబెట్టింది. దాయాది దేశం పాకిస్థాన్(Pakistan)తో జరిగిన మ్యాచ్ లో తక్కువ స్కోరును టీమ్ఇండియా కాపాడుకుంది. బుమ్రా 3 వికెట్లు తీసి తానెంత విలువైన ఆటగాడో చాటిచెబితే… అటు బ్యాటింగ్, ఇటు 3 క్యాచ్ లతో పంత్ మ్యాచ్ ను మనవైపు తిప్పాడు.
తొలుత…
న్యూయార్క్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత భారత్.. 19 ఓవర్లో 119కే ఆలౌటైంది. నసీమ్, రవూఫ్ చెరో 3 వికెట్లు తీసుకోవడంతో పంత్ మినహా పెద్దగా ఎవరూ నిలవలేదు. రోహిత్(13), కోహ్లి(4), పంత్(42), అక్షర్(20), సూర్య(7), దూబె(3), పాండ్య(7), జడేజా(0) ఇలా వచ్చి అలా వెళ్లారు.
కానీ ఆ తర్వాత…
అయితే పాక్ 73/3తో విజయం దిశగా సాగింది. ఆ టైంలో భారత్ గెలుపు అంచనా 8% మాత్రమే. కానీ స్లాగ్ ఓవర్లలో బుమ్రా ఆటాడుకున్నాడు. బాబర్(13), ఉస్మాన్(13) ఔటైనా రిజ్వాన్(31) క్రీజును అతుక్కుపోయాడు. కానీ సూపర్ ఇన్ స్వింగర్ తో అతణ్ని బౌల్డ్ చేసిన బుమ్రా.. ఇఫ్తికార్(5)ను ఔట్ చేశాడు. బుమ్రా 3, పాండ్య 2 వికెట్లు తీయడంతో జమాన్(13), ఇమాద్(15), షాదాబ్(4) ఔట్ కాగా… భారత్ ఉత్కంఠ విజయం సాధించింది.