మహిళల(Women) ఆసియా కప్ లో తన తొలి మ్యాచ్ లోనే భారత జట్టు.. పాకిస్థాన్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. శ్రీలంకలోని దంబుల్లాలో జరిగిన టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన దాయాది దేశం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 108కే ఆలౌటైతే.. భారత్ 109/3తో నిలిచి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఓపెనర్లు గుల్ ఫిరోజా(5), మునీబా అలీ(11), సిద్రా అమీన్(25), అలియా రియాజ్(6), నిదా దార్(8), తబా హుస్సేన్(22), ఫాతిమా సనా(22) చేస్తే… దీప్తి శర్మ 3, రేణుకా సింగ్, పూజ వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్ తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం భారత్ ఓపెనర్లు షెఫాలి వర్మ(40), స్మృతి మంధాన(45) తొలి వికెట్ కు 85 పరుగులు జోడించారు. ఈ ఇద్దరితోపాటు డయాలన్ హేమలత(14) ఔటైతే.. హర్మన్ ప్రీత్(5 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్(3 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు.