సొంతగడ్డపై తొలి మ్యాచులో భారత్ ను ఓడించి(Defeat) ఊపు మీద కనిపించిన జింబాబ్వే.. రెండో టీ20లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. 235 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆ టీమ్.. 76 రన్స్ కే 7 వికెట్లు కోల్పోయింది. పేసర్లు ముకేశ్, ఆవేశ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రన్స్ రావడం కష్టమైపోయింది.
అంతకుముందు…
అభిషేక్(100; 47 బంతుల్లో 7×4, 8×6), గిల్(2), రుతురాజ్(77 నాటౌట్; 47 బంతుల్లో 11×4, 1×6), రింకూసింగ్(48 నాటౌట్; 22 బంతుల్లో 2×4, 5×6) దంచుడుతో భారత్ 234/2తో భారీ స్కోరు వచ్చింది.
తర్వాత…
జింబాబ్వే జట్టులో మధేవ్రే(43), బెనెట్(26) కైయా(4), మయర్స్(0), కెప్టెన్ రజా(4), క్యాంప్ బెల్(10), కీపర్ మదాండే(0) ఔటైతే చివర్లో జోంగ్వే(33 నాటౌట్) నిలిచాడు. కానీ 18.4 ఓవర్లలో 134కే ఆలౌటై 100 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో ఇరుజట్లు 1-1తో నిలిచాయి.