బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగిన మ్యాచ్ లో తొలుత టీమ్ఇండియాకు బ్యాటర్లు రాణిస్తే తర్వాత బౌలర్లు సత్తా చూపారు. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ప్రత్యర్థిని 3 వికెట్లతో కుల్దీప్ ఉక్కిరిబిక్కిరి చేశాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 196/5 స్కోరు చేస్తే తర్వాత బంగ్లా కీలక వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. చివరకు 8 వికెట్లకు 146కే పరిమితమై 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
బ్యాటింగ్ భళా…
రోహిత్(23; 11 బంతుల్లో 3×4, 1×6), విరాట్(37; 28 బంతుల్లో 1×4, 3×6), పంత్(36; 24 బంతుల్లో 4×4, 2×6), దూబె(34; 24 బంతుల్లో 3×6), పాండ్య(50 నాటౌట్; 27 బంతుల్లో 4×4, 3×6) రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
తర్వాత…
బంగ్లా బ్యాటింగ్ లో లిట్టన్(13), తాంజిద్(29), నజ్ముల్ శాంటో(40), తౌహిద్(4), షకీబ్(11) పరుగులు చేశారు. శాంటో మాత్రమే భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి కుల్దీప్ 3 వికెట్లు తీసుకుంటే.. బుమ్రా మరింత టైట్ బౌలింగ్ తో 13 రన్స్ ఇచ్చి 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అర్షదీప్ కు సైతం 2 వికెట్లు దక్కాయి.