
మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 04 Jan 2024
సెషన్ సెషన్ కు రసవత్తకరంగా మారిన ఆటలో మన జట్టుదే పైచేయి అయింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. పేస్ బౌలర్ల విజృంభణతో వికెట్లు టపటపా కూలిన మ్యాచ్ లో.. భారత జట్టు కొత్త రికార్డు సృష్టిస్తూ అద్భుత విజయాన్ని(Great Victory) అందుకుంది. 79 పరుగుల టార్గెట్ తో రెండో రోజు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా.. జైస్వాల్(28; 23 బాల్స్ లో 6×4) మెరుపులతో.. టార్గెట్ ఛేదనలో స్పీడ్ అందుకుంది. కేవలం మూడు వికెట్లే కోల్పోయి 80 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో చరిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. గిల్(10), విరాట్(12) ఔటైనా మిగతా లాంఛనాన్ని రోహిత్(17 నాటౌట్), శ్రేయస్(4 నాటౌట్) పూర్తి చేశారు.
కేప్ టౌన్ లో జరుగుతున్న ఈ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలితే.. ప్రతిగా భారత జట్టు 153కు ఆలౌటై 98 రన్స్ లీడ్ సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సఫారీ టీమ్ 176కు ఆలౌటై ప్రత్యర్థి ముందు 79 పరుగుల టార్గెన్ ను ఉంచింది. కేవలం ఒకటిన్నర రోజులోనే మ్యాచ్ ముగియడం విశేషంగా నిలిచింది. మ్యాచ్ లో మూడు ఇన్నింగ్స్ లూ పేస్ బౌలర్ల ఆధిపత్యానికే కారణమయ్యాయి. ఈ గెలుపుతో భారత జట్టు కొత్త రికార్డును క్రియేట్ చేసింది. 1882 సంవత్సరంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో అత్యల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లిష్ జట్టు కుప్పకూలింది. ఆనాటి మ్యాచ్ లో 85 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగి 77 రన్స్ కే ఇంగ్లండ్ చేతులెత్తేసింది.
ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది టీమ్ఇండియా. కేప్ టౌన్ లో టెస్ట్ మ్యాచ్ నెగ్గిన తొలి ఆసియా దేశంగా భారత్ నిలిచింది. ఈ టూర్ లో వన్డే సిరీస్ ను గెలుచుకున్న టీమిండియా.. టీ20, టెస్ట్ సిరీస్ ను సమం చేసింది. కేవలం 107 ఓవర్ల(642 బంతుల్లోనే)లో ఈ మ్యాచ్ ముగియడం కొత్త చరిత్రకు నాంది పలికింది. తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో ప్రత్యర్థి నడ్డివిరిచిన మహ్మద్ సిరాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ను జస్ప్రీత్ బుమ్రా, డీన్ ఎల్గర్ జాయింట్ గా పంచుకున్నారు. ఈ మ్యాచ్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ కు డీన్ ఎల్గర్ గుడ్ బై చెప్పేశాడు.