భారత అండర్-19 కుర్రాళ్లు వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా.. బ్యాట్ తో రెచ్చిపోయారు. ఈ ఇద్దరి బాదుడుతో ఆతిథ్య ఇంగ్లండ్ బెంబేలెత్తిపోయింది. అండర్-19 యూత్ నాలుగో వన్డేలో టాస్ ఓడిన భారత్.. ఇద్దరి ధనాధన్ సెంచరీలతో 363/9 పరుగుల భారీ స్కోరు చేసింది. సూర్యవంశీ(143; 78 బంతుల్లో 13×4, 10×6), మల్హోత్రా(129; 121 బంతుల్లో 15×4, 3×6) ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. 51 బాల్స్ లో సెంచరీ చేసిన వైభవ్ ఆటే హైలెట్. దొరికిన బంతినల్లా ఉతికి ఆరేస్తూ 10 సిక్స్ లు రాబట్టాడు.