ప్రపంచకప్ గెలిచిన ప్లేయర్ ఒక్కరూ లేకున్నా అసలు వరల్డ్ కప్ కే అర్హత(Qualify) సాధించని జట్టు చేతిలో ఓటమి పాలైన భారత జట్టు… ఈరోజు జింబాబ్వేతో వరుసగా రెండో మ్యాచ్ ఆడబోతున్నది. నిన్న జరిగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో ఓటమి చెందిన గిల్ సేన.. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు మొదలయ్యే మ్యాచులో తప్పక గెలవాల్సి ఉంటుంది.
బ్యాటింగే…
IPLలో దుమ్మురేపిన అభిషేక్ శర్మ, రుతురాజ్, రియాన్ పరాగ్, రింకూ శర్మ, ధ్రువ్ జురెల్.. నిన్నటి మ్యాచులో తక్కువకే ఔటయ్యారు. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న జింబాబ్వేను కట్టడి చేస్తేనే 5 మ్యాచ్ ల సిరీస్ ను దక్కించుకునేలా అడుగు ముందుకు పడే అవకాశం ఉంటుంది.