అనంతపూర్లో జరుగుతున్న దులీప్ ట్రోఫీలో బ్యాటర్లు చెలరేగుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా ‘సి’ 525 పరుగుల భారీ స్కోరు(Big Score) చేస్తే.. ఇండియా ‘బి’ సైతం దీటుగా జవాబిస్తున్నది. రెండో రోజు(Second Day) ఆట ముగిసే సమయానికి ఇండియా ‘బి’ ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(51 నాటౌట్), నారాయణ్ జగదీశన్(67 నాటౌట్) క్రీజులో ఉండగా ఆ జట్టు 124/0తో నిలిచింది.
357/5తో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా ‘సి’.. మిడిలార్డర్ బాగా ఆడటంతో పెద్ద స్కోరే చేసింది. ఇషాన్ కిషన్ సెంచరీ(111)కి తోడు బాబా ఇంద్రజిత్(78), మానవ్ సుతార్(82), అన్షుల్ కాంబోజ్(38) రన్స్ చేశారు. ఇండియా ‘బి’ బౌలర్లలో ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్ తలో నాలుగు వికెట్ల చొప్పున తీసుకున్నారు.