స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే జైస్వాల్(0) డకౌటయ్యాడు. కానీ మరో ఓపెనర్(Opener) రాహుల్(37)తోపాటు గిల్(31) నిలకడగా ఆడటంతో భారత్ బాగానే ఆడుతుందనిపించింది. కానీ అంతలోనే మళ్లీ కుదుపులు మొదలై వరుసగా వికెట్లు పడ్డాయి. ఆడిలైడ్(Adelaide)లో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయడంతో టీమ్ఇండియా కష్టాల్లో పడింది. జైస్వాల్, రాహుల్, కోహ్లి(7) వికెట్లను స్టార్క్ దక్కించుకోగా.. బోలాండ్ బౌలింగ్ లో గిల్ వికెట్ల ముందు(LBW) దొరికిపోయాడు. ఇలా ముగ్గురు చకచకా వికెట్లు సమర్పించుకోవడంతో 69/1తో ఉన్న స్కోరు కాస్తా 81/4కు చేరుకుంది. ఆ తర్వాత రిషభ్ పంత్, ఆరో నంబర్లో కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ కు వచ్చారు.