భారత హాకీ(Hockey) జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుని పతకం దిశగా ఇంకో అడుగు(Step) ముందుకేసింది. పారిస్ ఒలింపిక్స్ లో భాగంగా గ్రేట్ బ్రిటన్(GB)తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో గెలిచింది.
22వ నిమిషంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గోల్ చేసినా ఆ తర్వాత 5 నిమిషాలకే లీ మార్టన్ గోల్ తో బ్రిటన్ గట్టి పోటీనిచ్చింది. దీంతో ఇరుజట్లు నిర్ణీత 60 నిమిషాల్లో 1-1తో సమంగా ఉండటంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. అయితే చివరి హాఫ్ లో భారత్ 10 మందితోనే ఆడింది.
భారత ప్లేయర్ శ్రీజేశ్.. బ్రిటన్ కొట్టిన 11 షాట్లలో 10 గోల్స్ ను ఆపి మన విజయంలో కీలకపాత్ర పోషించాడు. షూటౌట్లోనూ తొలుత రెండు జట్లు 2-2తో నిలిచిన పరిస్థితుల్లో లలిత్ ప్రదీప్ మూడో గోల్ అందించడంతో టీమ్ఇండియా ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మరో గోల్ నమోదవడంతో భారత్ సెమీస్ లోకి ఎంటరైంది.