ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన వరుణ్ చక్రవరి.. ఆ పర్ఫార్మెన్స్(Performance) ఆధారంగా వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే లేటు వయసులో అరంగేట్రం చేసిన రెండో భారతీయుడిగా రికార్డులకెక్కాడు. కటక్ బారాబతి స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో వరుణ్.. తుది జట్టులోకి వచ్చాడు. 33 ఏళ్ల 164 రోజుల వయసులో వన్డేల్లో ప్రవేశించగా, అతని కన్నా ముందు ఈ రికార్డు ఫరూఖ్ ఇంజినీర్(Farokh Engineer)పై ఉంది. ఫరూఖ్ 36 ఏళ్ల 138 రోజుల వయసులో వన్డేల్లోకి ప్రవేశించాడు. 1974లో అతడు ఇంగ్లండ్ తో మ్యాచ్ మొదలుపెట్టాడు. అత్యధిక వయసులో ఎంట్రీ ఇచ్చిన రెండో ఆటగాడిగా వరుణ్ చక్రవర్తి రికార్డులకెక్కాడు. 1974లో ముగ్గురు ప్లేయర్లు లేటు ఎంట్రీ ఇస్తే, ఆ ముగ్గురూ ఒకే ప్రత్యర్థిపై కావడం విశేషం.
అత్యధిక వయసులో ఎంట్రీ ఇచ్చిన వీరులు వీరే…
* 1. ఫరూఖ్ ఇంజినీర్… 36 ఏళ్ల 138 రోజులు(1974-ఇంగ్లండ్ పై)
* 2. వరుణ్ చక్రవర్తి… 33 ఏళ్ల 164 రోజులు(2025-ఇంగ్లండ్ పై)
* 3. అజిత్ వాడేకర్… 33 ఏళ్ల 108 రోజులు(1974-ఇంగ్లండ్ పై)
* 4. దిలీప్ జోషి… 32 ఏళ్ల 350 రోజులు(1980-ఆస్ట్రేలియాపై)
* 5. సయ్యద్ అబిద్ అలీ… 32 ఏళ్ల 307 రోజులు(1974-ఇంగ్లండ్ పై)