ఐపీఎల్(Indian Premier League) అంటే ఇష్టపడని ప్లేయర్ ఎవరుంటారు. పేరుకు పేరు… సంపాదనకు సంపాదన. అందుకే ప్రపంచంలో ఏ ఇతర లీగ్ నైనా వదిలిపెట్టుకుంటారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో IPL దూరంగా ఉండాలని ఎవరూ అనుకోరు. టాలెంట్ ప్రదర్శించే ఆటగాళ్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయని ఫ్రాంచైజీలు. అంతేకాకుండా వాళ్లను పువ్వుల్లో పెట్టి చూసుకోవడంతో IPLలో చోటు దక్కడమే ఓ క్రేజ్ గా చూస్తున్నారు. అన్నట్లుగానే ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్.. ఈ సీజన్ లోనే అత్యధికం(Top)గా రూ.24.75 కోట్లకు అమ్ముడుపోయాడు.
బీసీసీఐ ప్రకటన…
భారత్ లో IPL ఈవెంట్ కోసం అవసరమైతే సీనియర్ జట్టు నుంచి సైతం విశ్రాంతి ఇస్తున్నారు. అలాంటి స్టార్ డమ్ ఉన్న ఈ టోర్నీకి భారత స్టార్ బౌలర్ దూరమయ్యాడు. గత కొద్ది నెలలుగా గాయంతో బాధపడుతున్న మహ్మద్ షమి.. ఏకంగా IPL-2024 సీజన్ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. సర్జరీ నిమిత్తం ఇంగ్లండ్(UK) వెళ్లనున్న అతడు.. ఈ మెగా ఈవెంట్ కు అందుబాటులో ఉండటం లేదని BCCI ప్రకటించింది. అక్కడే అతడు మూడు వారాల పాటు ఉండనున్నాడు. తొలుత ఇంజక్షన్ తో తగ్గుతుందని భావించినా చివరకు సర్జరీయే మార్గమని NCA(National Cricket Academy) డాక్టర్లు తేల్చారు.
ప్రపంచకప్ లో సత్తా…
33 ఏళ్ల షమి మొన్నటి వరల్డ్ కప్ లో ఎలా వికెట్లు తీసుకున్నాడో(Wicket Taker) చూశాం. అతడు ఆడిన చివరి మ్యాచ్ వరల్డ్ కప్ ఫైనలే కాగా… ఆ టోర్నీలో మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు. 229 టెస్టు, 195 వన్డే, 24 టీ20 వికెట్లు తీసుకున్న షమి.. దశాబ్దకాలంగా టీమ్ఇండియాకు సేవలందిస్తున్నాడు. దీంతో అతడు వచ్చే అక్టోబరు/నవంబరులో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగే టెస్టు మ్యాచ్ ల వరకు అందుబాటులో ఉండకపోవచ్చు.