భారత్-పాక్ మ్యాచ్ లో ఆసక్తికర సన్నివేశం(Scene) కనిపించింది. టాస్ వేశాక ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇవ్వడం చూస్తుంటాం. కానీ ఈ మ్యాచ్ లో షేక్ హ్యాండ్ కాదు కదా.. కనీసం ఒకరి ముఖం ఒకరు కూడా చూసుకోలేదు. కాయిన్ ను సూర్య పైకి విసరగా.. పాక్ కెప్టెన్ టాస్ గెలిచాడు. ఆ వెంటనే సూర్య వెళ్లిపోయాడు. మ్యాచ్ తొలి బంతిని వైడ్ వేసిన పాండ్య, రెండో బంతికి సయీమ్(0)ను ఔట్ చేశాడు. బుమ్రా క్యాచ్ అందుకున్నాడు. ఇక బుమ్రా వేసిన రెండో ఓవర్ రెండో బాల్ ను హారిస్(3) గాల్లోకి లేపి పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. ఇలా ఒకరి బౌలింగ్ లో మరొకరు క్యాచ్ పట్టారు.