IPL-2024 సమరంలో చివరి ఘట్టం నేడే జరగనుంది. లీగ్ దశలో(League Stage)లో దుమ్ముదులిపిన కోల్ కతా నైట్ రైడర్స్(KKR), చివర్లో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్(SRH).. చెన్నై చెపాక్ స్టేడియంలో తలపడతాయి. ప్లేఆఫ్స్ బెర్త్ ను అందరికన్నా ముందుగా ఖాయం చేసుకున్న KKR.. క్వాలిఫైయర్-1లోనూ సత్తా చూపి అప్రహతిహత విజయాలతో ఫైనల్ చేరింది.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్ల బ్యాటింగ్ తో రికార్డుల్ని బద్ధలు కొడుతూ సాగింది హైదరాబాద్ ప్రయాణం. మొదట్నుంచీ రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్(RR)ను వెనక్కు నెట్టి చివర్లో ఆ ప్లేస్ ను దక్కించుకుని మరీ.. తొలి క్వాలిఫైయర్ లో పరాజయం ఎదురైనా రెండో ఛాన్స్ ను కాపాడుకుని తుది పోరును దక్కించుకుంది.
IPL కప్పు కోసం పదేళ్లుగా నిరీక్షిస్తున్నది KKR అయితే.. ఎనిమిదేళ్ల తర్వాతనైనా అది దక్కుతుందా అని ఎదురుచూస్తున్న టీమ్ SRH. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య జరిగే తొలి ఫైనల్(First Final) మ్యాచ్ ఇదే కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డుపడే అవకాశముంది. ఒకవేళ అలా జరిగి మ్యాచ్ ఆగిపోయినా సోమవారం రిజర్వ్ డే నాడు మ్యాచ్ ఉంటుంది.