దేశంలో జరగబోతున్న ఎన్నికల(General Elections) దృష్ట్యా ఐపీఎల్-2024కు సంబంధించి తొలి షెడ్యూల్(First Schedule) మాత్రమే ప్రకటించిన BCCI.. ఇప్పుడు పూర్తి వివరాల్ని వెల్లడించింది. పన్నెండేళ్ల తర్వాత IPL ఫైనల్ మ్యాచ్ ను చెన్నై చెపాక్ లోని MA చిదంబరం స్టేడియంలో నిర్వహించబోతున్నది. ఈ ఫైనల్ మ్యాచ్ మే 26న జరుగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) సొంతగడ్డ కావడంతో అక్కడే ఈసారి తుది పోరు(Final) నిర్వహించాలని BCCI నిర్ణయించింది.
ఎలిమినేటర్ మ్యాచ్ లు…
ఫైనలే కాకుండా మే 24న జరిగే రెండో క్వాలిఫయర్(Qualifier) మ్యాచ్ కూ చెన్నై ఆతిథ్యమిస్తుంది. మే 21న జరిగే మొదటి క్వాలిఫయర్ తోపాటు 22న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ ల్ని అహ్మదాబాద్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. చెన్నై తొలిసారి 2011లో ఫైనల్ కు ఆతిథ్యమిస్తే.. మరుసటి ఏడాది అయిన 2012లో కంటిన్యూగా ఫైనల్స్ కు వేదికగా నిలిచింది. ఏప్రిల్ 8న మొదలయ్యే సెకండ్ పార్ట్ షెడ్యూల్ లో ప్లేఆఫ్స్ తో కలిపి మొత్తం 52 మ్యాచ్ లు జరుగుతాయని BCCI తెలిపింది.