ఐపీఎల్ మెగా వేలంలో రిషభ్ పంత్ అదరగొట్టాడు. అప్పటికే అర్షదీప్ సింగ్ రూ.18 కోట్లకు అమ్ముడైతే అతణ్ని మించి శ్రేయస్ అయ్యర్ రూ.26.75 కోట్లు పలికాడు. ఈ ఇద్దర్నీ మించి పంత్ అమ్ముడుపోయాడు. అతడి ధర రూ.20.75 కోట్ల నుంచి ఏకంగా రూ.27 కోట్లకు పెరిగిపోయింది. అతణ్ని అంత భారీ ధరకు లఖ్నవూ సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టోపై ఏ యాజమాన్యం ఆసక్తి చూపకపోవడంతో అన్ సోల్డ్ ప్లేయర్లుగా మిగిలిపోయారు.
ఆటగాళ్లు, పలికిన ధర ఇలా…
ప్లేయర్ | ఫైనల్ ప్రైజ్(రూపాయల్లో) | కొన్న ఫ్రాంచైజీ |
రిషభ్ పంత్ | 27 కోట్లు | లఖ్నవూ సూపర్ జెయింట్స్(LSG) |
శ్రేయస్ అయ్యర్ | 26.75 కోట్లు | పంజాబ్ కింగ్స్(PBKS) |
వెంకటేశ్ అయ్యర్ | 23.75 కోట్లు | కోల్ కతా నైట్ రైడర్స్(KKR) |
అర్షదీప్ సింగ్ | 18 కోట్లు | పంజాబ్ కింగ్స్(PBKS) |
యజువేంద్ర చాహల్ | 18 కోట్లు | పంజాబ్ కింగ్స్(PBKS) |
జోస్ బట్లర్ | 15.75 కోట్లు | గుజరాత్ టైటాన్స్(GT) |
కేఎల్ రాహుల్ | 14 కోట్లు | ఢిల్లీ క్యాపిటల్స్(DC) |
జోష్ హేజిల్ వుడ్ | 12.5 కోట్లు | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) |
జోఫ్రా ఆర్చర్ | 12.50 కోట్లు | రాజస్థాన్ రాయల్స్(RR) |
మహ్మద్ సిరాజ్ | 12.25 కోట్లు | గుజరాత్ టైటాన్స్(GT) |
మిచెల్ స్టార్క్ | 11.75 కోట్లు | ఢిల్లీ క్యాపిటల్స్(DC) |
ఫిల్ సాల్ట్ | 11.50 కోట్లు | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) |
ఇషాన్ కిషన్ | 11.25 కోట్లు | సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) |
జితేష్ శర్మ | 11 కోట్లు | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) |
మార్కస్ స్టాయినిస్ | 11 కోట్లు | పంజాబ్ కింగ్స్(PBKS) |
కగిసో రబాడ | 10.75 కోట్లు | గుజరాత్ టైటాన్స్(GT) |
మహ్మద్ షమీ | 10 కోట్లు | సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) |
రవిచంద్రన్ అశ్విన్ | 9.75 కోట్లు | చెన్నై సూపర్ కింగ్స్(CSK) |
ప్రసిద్ధ్ కృష్ణ | 9.5 కోట్లు | గుజరాత్ టైటాన్స్(GT) |
జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ | 9 కోట్లు | ఢిల్లీ క్యాపిటల్స్(DC) |
లియామ్ లివింగ్ స్టోన్ | 8.75 కోట్లు | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) |
హర్షల్ పటేల్ | 8 కోట్లు | సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) |
డేవిడ్ మిల్లర్ | 7.5 కోట్లు | లఖ్నవూ సూపర్ జెయింట్స్(LSG) |
హ్యారీ బ్రూక్ | 6.25 కోట్లు | ఢిల్లీ క్యాపిటల్స్(DC) |
డెవాన్ కాన్వే | 6.25 కోట్లు | చెన్నై సూపర్ కింగ్స్(CSK) |
రచిన్ రవీంద్ర | 4 కోట్లు | చెన్నై సూపర్ కింగ్స్(CSK) |