IPL-2025 మెగా వేలం వరుసగా రెండోరోజూ కంటిన్యూ అయింది. ఇందులో పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు అత్యధికం(Highest)గా 10.75 కోట్లు దక్కాయి. అతడి కోసం రాయల్ ఛాలెంజర్స్, ముంబయ ఇండియన్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. అయితే ముంబయి, లఖ్నవూ మాత్రం రూ.10 కోట్ల వరకే ముందుకు వచ్చాయి. కానీ RCB అనూహ్యంగా భారీ మొత్తం కట్టబెడుతూ అతణ్ని సొంతం చేసుకుంది. కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్(న్యూజిలాండ్), షాయ్ హోప్(వెస్టిండీస్), అలెక్స్ క్యారీ(ఆస్ట్రేలియా) వంటి ఆటగాళ్లు అమ్ముడుపోలేదు.
ప్లేయర్ | ధర(రూపాయల్లో) | కొన్న ఫ్రాంచెజీ |
భువనేశ్వర్ కుమార్ | 10.75 కోట్లు | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) |
దీపక్ చాహర్ | 9.25 కోట్లు | ముంబయి ఇండియన్స్(MI) |
ఆకాశ్ దీప్ | 8 కోట్లు | లఖ్నవూ సూపర్ జెయింట్స్(LSG) |
మార్కో యాన్సెన్ | 7 కోట్లు | పంజాబ్ కింగ్స్(PBKS) |
తుషార్ దేశ్ పాండే | 6.50 కోట్లు | రాజస్థాన్ రాయల్స్(RR) |
కృణాల్ పాండ్య | 5.75 కోట్లు | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) |
నితీశ్ రాణా | 4.20 కోట్లు | రాజస్థాన్ రాయల్స్(RR) |
వాషింగ్టన్ సుందర్ | 3.20 కోట్లు | గుజరాత్ టైటాన్(GT) |
అన్షుల్ కాంబోజ్ | 3.20 కోట్లు | చెన్నై సూపర్ కింగ్స్(CSK) |
శామ్ కరణ్ | 2.40 కోట్లు | చెన్నై సూపర్ కింగ్స్(CSK) |
గెరాల్డ్ కోయెట్జీ | 2.40 కోట్లు | గుజరాత్ టైటాన్(GT) |