ఐపీఎల్ సీజన్లో ఆఖరి సమరం నేటి నుంచే ప్రారంభమవుతున్నది. బ్యాటింగ్ తో అదరగొడుతున్న రెండు జట్లు కోల్ కతా నైట్ రైడర్స్(KKR), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య తొలి మ్యాచ్ జరగబోతున్నది. బౌన్సీ(Bouncy) పిచ్ అయిన అహ్మదాబాద్(Ahmedabad) స్టేడియంలో తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.
సాల్ట్ తప్పుకున్నా…
ఓపెనర్ ఫిల్ సాల్ట్ వైదొలిగి స్వదేశం వెళ్లిపోయినా సునీల్ నరైన్, అండ్రీ రసెల్, రింకూ సింగ్ రూపంలో హిట్టర్లు KKR విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అటు ఈ ముగ్గురి మాదిరిగానే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ SRH తరఫున దుమ్ముదులుపుతున్నారు. అయితే మొన్న మార్చిలో గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన మ్యాచ్ లో ఇదే పిచ్ పై హైదరాబాద్ కేవలం 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేయగలిగింది.
బౌలింగ్ లోనూ…
టర్నింగ్ పిచ్ పై కోల్ కతా స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వికెట్లు తీసే అవకాశముంది. హైదరాబాద్ కు కమిన్స్, నటరాజన్ కీలకంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి.