బీసీసీఐకి కాసుల పంట కురిపిస్తున్న ఐపీఎల్(Indian Premier League) 2024 సీజన్ ఖరారైంది. ఈ షెడ్యూల్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) విడుదల చేసింది. ఈ సారి జరగబోయే టోర్నీ(Event) మొత్తాన్ని భారత్ లోనే నిర్వహించనుండగా… మార్చి 22 నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు(General Elections) ఉన్నందున మ్యాచ్ లన్నింటినీ స్వదేశంలోనే నిర్వహిస్తామని లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. ఈ ఎన్నికలు ఉన్నందునే ఇప్పటిదాకా 17వ ఎడిషన్ IPL షెడ్యూల్ విడుదలలో జాప్యం ఏర్పడింది. ముందుగా ఈ మెగా ఈవెంట్ ను ఏప్రిల్ లేదా మేలో నిర్వహించాలని భావించినా చివరకు వచ్చే నెలలోనే చేపట్టాలని నిర్ణయించారు.
సీజన్ మొత్తాన్ని…
దేశంలో జరగనున్న జనరల్ ఎలక్షన్స్ దృష్ట్యా రెండు విడత(Two Phases)లుగా ఈ టోర్నమెంట్ ను నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ టోర్నీకి సంబంధించిన తొలి 15 రోజుల(Fifteen Days) షెడ్యూల్ ను మాత్రమే వెల్లడించారు. మిగతా మ్యాచ్ ల వివరాల్ని ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత ప్రకటిస్తామని ధుమాల్ తెలిపారు. IPL మొత్తాన్ని విదేశం(సౌతాఫ్రికా)లో నిర్వహించడం 2009లో మాత్రమే జరిగింది. దేశంలో ఎన్నికల కారణంగా 2014లో కొన్ని మ్యాచ్ లను UAEలో ఆడించారు. మళ్లీ 2019లో మొత్తం టోర్నమెంట్ ను భారత్ లోనే పూర్తి చేశారు.
ఫైనల్ అప్పుడే జరుగుతుందా…
IPL-2024 ఫైనల్ మ్యాచ్ ను మే 26న నిర్వహించే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ కు కొద్ది ముందుగా ఈ ఫైనల్ జరిగే ఛాన్స్ ఉంది. భారత్ తన వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ను న్యూయార్క్ లో జూన్ 5న ఐర్లాండ్ తో మొదలు పెడుతుంది. అంటే వరల్డ్ కప్ ప్రారంభానికి 10 రోజుల ముందే IPL ముగుస్తుందన్నమాట. ఈ IPLకు సంబంధించిన వేలం గత డిసెంబరులో ముగియగా.. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ను అత్యధిక ధర(రూ.24.75 కోట్ల)తో కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది.