ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL-2025) షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్ తో టోర్నీ మొదలవుతుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ సైతం ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. మే 20న క్వాలిఫైయర్-1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్ లు హైదరాబాద్ లో నిర్వహిస్తారు. 2024 రన్నరప్ గా నిలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఇది హోం గ్రౌండ్. 13 వేదికల్లో 65 రోజుల పాటు మొత్తంగా 74 మ్యాచ్ లు నిర్వహిస్తారు. మార్చి 23న ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH)-రాజస్థాన్ రాయల్స్(RR) తలపడతాయి.