ఐపీఎల్(Indian Premier League) 17వ సీజన్ మెగా సంబరం ఇంకొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. సీజన్ స్టార్ట్ అవుతుందని ఒకపక్క క్రికెట్ అభిమానుల్లో ఆనందం కనిపిస్తుంటే మరోవైపు ఒక లెజండరీ కెప్టెన్సీ ముగిసిపోతుందన్న బాధ వ్యక్తమవుతున్నది. క్రికెట్ ఫ్యాన్స్ మదిలో చిరకాలం నిలిచిపోయే ఆ వ్యక్తే మహేంద్ర సింగ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదు కప్పులు అందించిన ధోని.. ఇకనుంచి ఐపీఎల్ లో సాధారణ ఆటగాడిగా, కీపర్ గా ఉంటాడు. అటు ముంబయికి ఇదే పరిస్థితి ఎదురైంది. టైటిళ్ల వీరుడిగా నిలిచిన రోహిత్ శర్మ సైతం కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆటకు సీజన్ మొదలైనా.. కీలక సారథులుగా శకం మాత్రం ముగిసిపోయినట్లయింది.
సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ…
17 రోజుల పాటు 21 మ్యాచ్ లు సాగే ఈ మెగా టోర్నీలో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్ ఆడతాయి. అత్యంత విజయవంతమైన సారథి(Captain)గా చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదు టైటిళ్లు అందించిన ధోని.. IPL కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపడుతున్నాడు.
తొలి దశ మ్యాచ్ ల షెడ్యూల్ ఇలా…
తేదీ | జట్లు | వేదిక |
మార్చి 22 | చెన్నై సూపర్ కింగ్స్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | చెన్నై |
మార్చి 23 | పంజాబ్ కింగ్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ | ముల్లాన్ పూర్ |
మార్చి 23 | కోల్ కతా నైట్ రైడర్స్ X సన్ రైజర్స్ హైదరాబాద్ | కోల్ కతా |
మార్చి 24 | రాజస్థాన్ రాయల్స్ X లఖ్ నవూ సూపర్ జెయింట్స్ | జైపూర్ |
మార్చి 24 | గుజరాత్ టైటాన్స్ X ముంబయి ఇండియన్స్ | అహ్మదాబాద్ |
మార్చి 25 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X పంజాబ్ కింగ్స్ | బెంగళూరు |
మార్చి 26 | చెన్నై సూపర్ కింగ్స్ X గుజరాత్ టైటాన్స్ | చెన్నై |
మార్చి 27 | సన్ రైజర్స్ హైదరాబాద్ X ముంబయి ఇండియన్స్ | హైదరాబాద్ |
మార్చి 28 | రాజస్థాన్ రాయల్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ | జైపూర్ |
మార్చి 29 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X కోల్ కతా నైట్ రైడర్స్ | బెంగళూరు |
మార్చి 30 | లఖ్ నవూ సూపర్ జెయింట్స్ X పంజాబ్ కింగ్స్ | లఖ్ నవూ |
మార్చి 31 | గుజరాత్ టైటాన్స్ X సన్ రైజర్స్ హైదరాబాద్ | అహ్మదాబాద్ |
మార్చి 31 | ఢిల్లీ క్యాపిటల్స్ X చెన్నై సూపర్ కింగ్స్ | విశాఖపట్నం |
ఏప్రిల్ 1 | ముంబయి ఇండియన్స్ X రాజస్థాన్ రాయల్స్ | ముంబయి |
ఏప్రిల్ 2 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X లఖ్ నవూ సూపర్ జెయింట్స్ | బెంగళూరు |
ఏప్రిల్ 3 | ఢిల్లీ క్యాపిటల్స్ X కోల్ కతా నైట్ రైడర్స్ | విశాఖపట్నం |
ఏప్రిల్ 4 | గుజరాత్ టైటాన్స్ X పంజాబ్ కింగ్స్ | అహ్మదాబాద్ |
ఏప్రిల్ 5 | సన్ రైజర్స్ హైదరాబాద్ X చెన్నై సూపర్ కింగ్స్ | హైదరాబాద్ |
ఏప్రిల్ 6 | రాజస్థాన్ రాయల్స్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | జైపూర్ |
ఏప్రిల్ 7 | ముంబయి ఇండియన్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ | ముంబయి |
ఏప్రిల్ 7 | లఖ్ నవూ సూపర్ జెయింట్స్ X గుజరాత్ టైటాన్స్ | లఖ్ నవూ |