మన దేశంలో క్రికెట్ కున్న క్రేజ్ ఏంటో IPL పరిశీలిస్తే అర్థమవుతుంది. ఫ్రాంఛైజీల ఆదాయాలు(Returns) భారీగా ఉంటూ ఆశ్చర్యపరుస్తున్నాయి. 2023-24లో 10 ఫ్రాంఛైజీల ఆదాయం రూ.6,797 కోట్లకు పెరిగింది. గతేడాది ఇది రూ.3,082 కోట్లు కాగా.. ఒక్క ఏడాదిలోనే ఇది డబుల్ కన్నా ఎక్కువైంది. 200 శాతానికి పైగా ఇన్ కం సంపాదించిన టీంలుగా పంజాబ్, చెన్నై, బెంగళూరు నిలిచాయి.
జట్ల వారీగా ఆదాయాలిలా…
1. గుజరాత్ టైటాన్స్ – రూ.776 కోట్లు
2. ముంబయి ఇండియన్స్ – రూ.737 కోట్లు
3. కోల్ కతా నైట్ రైడర్స్ – రూ.698 కోట్లు
4. లక్నో సూపర్ జెయింట్స్ – రూ.695 కోట్లు
5. చెన్నై సూపర్ కింగ్స్ – రూ.676 కోట్లు
6. పంజాబ్ కింగ్స్ – రూ.664 కోట్లు
7. రాజస్థాన్ రాయల్స్ – రూ.662 కోట్లు
8. సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ.659 కోట్లు
9. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ.650 కోట్లు
10. ఢిల్లీ క్యాపిటల్స్ – రూ.580 కోట్లు