సోషల్ మీడియా వల్ల ధోని(Dhoni) ఇరుకునపడ్డట్లయింది. 2008 ఆస్ట్రేలియా టూర్లో ఇర్ఫాన్ పఠాన్ రాణించినా, బాగా ఆడలేదని మహీ అన్నట్లు ప్రచారం జరిగింది. నేరుగా ధోనినే వెళ్లి అడిగితే అలా ఏం లేదన్నాడు. దీంతో పఠాన్.. ‘నాకు ఎవరి గదిలోనూ హుక్కా పెట్టడం అలవాటు లేదు.. కొన్నిసార్లు మాట్లాడకపోవడమే మంచిది..’ అని అన్నాడు. ఈ హుక్కా పదం వైరలై ధోనినే అన్నాడని భావించారు. చాలా ఏళ్లకు ఇప్పుడో అభిమాని ‘పఠాన్ భాయ్ హుక్కా ఏమైంది’ అంటూ పోస్ట్ చేశాడు. దానికి ‘మై ఔర్ @msdhoni సాథ్ బైఠ్ కర్ పీయేంగే(నేను, ధోని కలిసి కూర్చుని పీల్చుతాం)’ అని ఇర్ఫాన్ బదులివ్వడంతో హాట్ టాపికైంది.