ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) ఛైర్మన్ గా మరోసారి భారతీయుడు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఛైర్మన్ పదవికి BCCI కార్యదర్శి జైషా ఏకగ్రీవం(Unopposed)గా ఎన్నికయ్యాడు. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగే ఆయన డిసెంబరు 1న బాధ్యతలు చేపట్టనుండగా. అత్యంత చిన్న వయసు(35 ఏళ్లు)లో ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
ఇప్పటిదాకా ICC చీఫ్ లుగా నలుగురు భారతీయులు పనిచేస్తే అందులో ఇద్దరు అధ్యక్షులుగా, మరో ఇద్దరు ఛైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. జగ్మోహన్ దాల్మియా(1997-2000), శరద్ పవార్(2010-2012) అధ్యక్షులుగా… ఎన్.శ్రీనివాసన్(2014-2015), శశాంక్ మనోహర్(2015-2020) ఛైర్మన్లుగా చేశారు. జైషా BCCI సెక్రటరీగానే కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) ఛైర్మన్ గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ బాధ్యతలు చేపట్టనుండటంతో ACCకి రాజీనామా చేయాల్సి ఉంటుంది.