ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడు, కెప్టెన్ శుభ్మన్ గిల్ సంయమనంతో జింబాబ్వేపై భారత్ కు ఘన విజయం దక్కింది. ప్రత్యర్థి విసిరిన లక్ష్యాన్ని(Target) గిల్ సేన ఉఫ్ మని ఊదేసింది. తొలుత జింబాబ్వే 7 వికెట్లకు 152 స్కోరు చేస్తే.. మరో 28 బంతులు మిగిలి ఉండగానే 15.2 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. ఒక్క వికెట్టూ కోల్పోకుండా 156/0 స్కోరుతో 10 వికెట్ల ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
గిల్ కూల్…
ఒకవైపు గిల్(58 నాటౌట్; 39 బంతుల్లో 6×4, 2×6) కూల్ గా ఆడుతుంటే మరో ఎండ్ లో యశస్వి(93 నాటౌట్; 53 బంతుల్లో 13×4, 2×6) దంచికొట్టాడు. అతడి ధాటికి జట్టు స్కోరు 3.5 ఓవర్లలో 50కి చేరితే ఈ జోడీ 58 బాల్స్ లోనే 100 పూర్తి చేసింది. ఇక ఈ లెఫ్ట్ హ్యాండర్ 29 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ దాటాడు. ఈ జోడీని విడదీసేందుకు ఎంత ప్రయత్నించినా సికిందర్ సేనకు సాధ్యం కాలేదు.
సిరీస్ మనదే…
వరుసగా మూడింట్లో గెలుపొందిన భారత్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్ లో జింబాబ్వే గెలిచిన సంగతి తెలిసిందే.