BCCI కార్యదర్శిగా ఉన్న జైషా.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టాడు. ఈ పదవిలో చేరిన ఐదో భారతీయుడిగా నిలిచాడు. 36 ఏళ్ల జైషా గత ఐదేళ్లుగా BCCI సెక్రటరీగా పనిచేస్తున్నాడు. న్యూజిలాండ్ కు చెందిన అటార్నీ గ్రెగ్ బార్క్ లీ మూడోసారి కొనసాగడం ఇష్టం లేక పదవి నుంచి తప్పుకోవడంతో ICC బోర్డు డైరెక్టర్లు జైషాను ఏకగ్రీవం(Unanimous)గా ఎన్నుకున్నారు. ఇతడి కంటే ముందు జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శశాంక్ మనోహర్, ఎన్.శ్రీనివాసన్.. ప్రపంచ క్రికెట్ అధినేతగా పనిచేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడైన జై.. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ప్రస్థానం ప్రారంభించాడు. 2028లో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు కల్పించడంతోపాటు మహిళా క్రికెట్ ను ఉన్నత స్థానానికి చేర్చడమే ICC ఛైర్మన్ గా తన లక్ష్యమని షా స్పష్టం చేశాడు.