ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) ఛైర్మన్ గా BCCI కార్యదర్శి జైషాకే అవకాశాలున్నాయి. అన్నీ కుదిరితే త్వరలోనే ఆయన ICC ఛైర్మన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు సాక్షాత్తూ ICC ఛైర్మన్ గ్రెగ్ బార్ క్లే ఈ విషయాన్ని లీక్ చేశారు. ఆయన పదవీకాలం నవంబరుతో ముగుస్తుంది. మూడోసారి పదవిలో కొనసాగడం తనకు ఇష్టం లేదంటూ ICC డైరెక్టర్లతో ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్నారు.
ఇప్పటిదాకా ICC చీఫ్ లుగా నలుగురు భారతీయులు పనిచేస్తే అందులో ఇద్దరు అధ్యక్షులుగా, మరో ఇద్దరు ఛైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. జగ్మోహన్ దాల్మియా(1997-2000), శరద్ పవార్(2010-2012) అధ్యక్షులుగా… ఎన్.శ్రీనివాసన్(2014-2015), శశాంక్ మనోహర్(2015-2020) ఛైర్మన్లుగా చేశారు.